
దేశవ్యాప్తంగా హిందీ 'బిగ్ బాస్' షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సారి "ఘర్వాలూన్ కీ సత్తా" అనే థీమ్‌తో ' బిగ్ బాస్ 19 సీజన్' సిద్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ 'బిగ్ బాస్ 19' ఆదివారం, ఆగస్టు 24న జియో హాట్‌స్టార్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఆ తర్వాత కలర్స్ టీవీలో రాత్రి 10.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఈసారి మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, WWE స్టార్ ది అండర్‌టేకర్ వైల్డ్-కార్డ్ ఎంట్రీలుగా ' బిగ్ బాస్ 19 ' హౌస్ లో రాబోతున్నట్లు జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మేకర్స్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ డీల్ ఖరారైతే, టైసన్ , అండర్‌టేకర్ దాదాపు ఒక వారం పాటు హౌస్ లో ఉండే అవకాశం ఉంది. మైక్ టైసన్ , అండర్‌టేకర్ ఎంట్రీతో 'బిగ్ బాస్ 19' రియాలిటీ షో చరిత్రలో నిలిచిపోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ' బిగ్ బాస్' షోకి ఎంట్రీ అవ్వడం వల్ల మరింత హైప్ ను క్రియేట్ చేస్తోందని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా పలువురు ప్రపంచ స్థాయి ప్రముఖులు ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. తమ ఆటలో మెప్పించారు. ఈ షో కొనసాగడానికి కూడా దోహదపడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా టైసన్ వంటి దిగ్గజాలు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే మరింత ఉత్సాహన్ని తీసుకురావచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
బిగ్ బాస్ సీజన్ 4 లో పమేలా ఆండర్సన్ మూడు రోజుల పాటు హౌస్ లో ఉండి సందడి చేసింది. అదే విధంగా సీజన్ 5లో ప్రవేశించిన సన్నీ లియోన్ .. బాలీవుడ్‌లోకి విజయవంతంగా అడుగుపెట్టింది. నోరా ఫతేహి, ఎల్లి అవ్రమ్, సోఫియా హయాత్, క్లాడియా సియెస్లా, జాసన్ షా, నటాసా స్టాంకోవిచ్, వీనా మాలిక్, మండానా కరిమి, అబ్దు రోజిక్ వంటి వారు కూడా వివిధ సీజన్‌లలో భాగమయ్యారు. ప్రతి ఒక్కరు తమ గ్లామర్, వివాదం, ఆకర్షణను తెచ్చి ఈ షోను మరింత వినోదాత్మకంగా మార్చారు. ప్రేక్షకులను మెప్పించారు.
అయితే ఈ ' బిగ్ బాస్ సీజన్19 ' కు సల్మాన్ ఖాన్ మొదటి మూడు నెలలు హోస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫరా ఖాన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్ వంటి అతిథి హోస్ట్‌లు బాధ్యతలు తీసుకోవచ్చు. మరో వైపు ఈ షోలో అష్నూర్ కౌర్, అభిషేక్ బజాజ్, అవేజ్ దర్బార్, నగ్మా మిరాజ్కర్, షెహబాజ్ బదేషా, మృదుల్ తివారీ, సివెట్ తోమర్, బసీర్ అలీ, హునార్ హాలే వంటి వారు పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ సారి మైక్ టైసన్, అండర్‌టేకర్ వంటి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే బిగ్ బాస్ 19 వేరే లెవల్ కు వెళ్లడం ఖామని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.