సికిందర్ సరే.. మదరాసి మాటేంటి మురుగా..? డైరెక్టర్‎కు సల్మాన్ ఖాన్ కౌంటర్

సికిందర్ సరే.. మదరాసి మాటేంటి మురుగా..? డైరెక్టర్‎కు సల్మాన్ ఖాన్ కౌంటర్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌‌‌‌ మురుగదాస్‌‌పై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కాంబినేషన్‌‌లో వచ్చిన ‘సికిందర్‌‌‌‌’ చిత్ర పరాజయం విషయంలో ఒకరిపై ఒకరు కామెంట్స్‌‌ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ‘మదరాసి’ చిత్రం ప్రమోషన్స్‌‌లో ‘సికిందర్‌‌‌‌’ రిజల్ట్‌‌పై మురుగదాస్‌‌ స్పందించారు. సినిమా ప్లాప్‌‌కు హీరోనే కారణమని, సెట్‌‌కు సల్మాన్ చాలా ఆలస్యంగా వచ్చేవాడని చెప్పుకొచ్చాడు. 

ఒక్కోసారి రాత్రి 9 తర్వాతే సల్మాన్ రావడంతో, మధ్యాహ్నం 2 గంటలకు తీయాల్సిన సీన్స్‌‌ రాత్రి 3 గంటలకు తీశామని చెప్పాడు. దీనిపై ఇన్నిరోజులు సైలెంట్‌‌గా ఉన్న సల్మాన్‌‌ ఖాన్.. ఆదివారం తను హోస్ట్‌‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌‌ బాస్​ షోలో రియాక్ట్ అయ్యాడు. ‘‘తీవ్రమైన గాయాలతో నేను షూటింగ్‌‌కు ఆలస్యంగా వస్తే.. దర్శకుడు మురుగదాస్ దాన్ని మరోలా చిత్రీకరించి నన్ను నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిద్ నడియాడ్‌‌వాలా తప్పుకుంటే.. ఆ తర్వాత ‘మదరాసి’ తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయాడు. 

అక్కడి నటుడు (శివకార్తికేయన్‌‌) 6 గంటలకే షూటింగ్‌‌కు వచ్చాడు.. అందుకే ‘సికిందర్‌‌‌‌’ని మించి ‘మదరాసి’ పెద్ద బ్లాక్‌‌బస్టర్‌‌‌‌ అయింది” అంటూ వ్యంగ్యంగా మురుగదాస్‌‌కు చురకలు అంటించాడు. మొత్తానికి ‘సికిందర్‌‌‌‌’ విషయంలో తనపై నిందలు వేసిన మురుగదాస్‌‌.. ‘మదరాసి’తో మెప్పించలేదే అంటూ గట్టిగానే కౌంటర్‌‌‌‌ ఇచ్చాడు సల్మాన్ ఖాన్.  దీనిపై మురుగదాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!