
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ 3’. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై చిత్రాల తర్వాత ఈ ప్రాంచైజీలో వస్తున్న మూడో స్పై యాక్షన్ మూవీ ఇది. మనీశ్ శర్మ దర్శకుడు. సల్మాన్‌కు జంటగా మరోసారి కత్రినా కైఫ్ నటిస్తోంది. ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. అబుదాబిలో జరిగిన ‘ఐఫా’ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్న సల్మాన్.. షూటింగ్ పూర్తయిన విషయాన్ని రివీల్ చేశాడు.
అంతేకాదు ఇప్పటికే ప్రకటించినట్టు దీపావళికే సినిమా రాబోతోందని మరోసారి కన్‌ఫర్మ్ చేశాడు. షారుఖ్ రీసెంట్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ గెస్ట్ రోల్ చేయగా, ఇప్పుడు ‘టైగర్ 3’లో షారుఖ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఇద్దరు హీరోల అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రేవతి, అశుతోష్ రాణా, అనుప్రియా గోయెంకా, రిద్ధి డోగ్రా, అంగద్ బేడి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. నవంబర్ 10న సినిమా విడుదల కానుంది.