వెంటిలేటర్పై సల్మాన్ రష్దీ

వెంటిలేటర్పై సల్మాన్ రష్దీ

న్యూయార్క్: భారత సంతతికి చెందిన రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. దుండుగడి కత్తి దాడిలో సల్మాన్రష్దీకి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆయన చేతులలో నరాలు తెగిపోయాయని, కత్తిపోట్లకు కాలేయం దెబ్బతినడంతో కన్ను కోల్పోయే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. 

అమెరికాలోని చౌతాక్వా ఇన్ స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించేందుకు సల్మాన్ రష్డీ న్యూయార్క్ వచ్చారు. వేదికపై ఎక్కిన ఆయన ప్రసంగానికి ముందు ఆహుతులను పరిచయం చేసుకుంటున్న సమయంలో దుండగుడు దాడి చేశాడు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఆయనపై  హత్యాయత్నం జరిగింది. నల్లటి దుస్తులు ధరించి.. నల్లటి మాస్కు పెట్టుకున్న దుండగుడు వేదికపైకి దూసుకు వచ్చాడు. 
కేవలం 20 సెకన్ల వ్యవధిలో సల్మాన్ రష్డీపై 10 నుంచి 15సార్లు   కత్తితో పొడిచాడు. ఈ దాడిని స్టంటేమో అని భావించామని.. రక్తస్రావం గమనించి నిజమైన కత్తిపోట్లేనని గుర్తించామని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రక్తపు మడుగులో స్టేజిపైనే రష్దీ కుప్పకూలిపోయిన రష్డీని హుటాహుటిన హెలికాప్టర్లో హాస్పిటల్ కు తరలించారు. రష్దీపై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఎందుకు చేశాడన్నది చెప్పడం లేదని సమాచారం.  

 


1947లో ముంబైలో జన్మించిన సల్మాన్ రష్దీ.. కొన్నేళ్లకే బ్రిటన్ కు వలస వెళ్లిపోయారు. అటు తర్వాత రచయితగా మారిన ఆయన ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ పుస్తకంతో పాపులర్ అయ్యారు. 1981లో ఈ పుస్తకానికి బుకర్ ప్రైజ్ రావడంతో రష్దీ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం అయింది. అయితే 1988లో ఆయన  రాసిన 4వ నవల ‘ది సాంటానిక్ వర్సెస్’ పుస్తకం వివాదాస్పదం అయింది. ఇరాన్ ప్రభుత్వం ఈ బుక్ పై నిషేధం విధించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేని రష్దిపై ఫత్వా జారీ చేశారు. సల్మాన్ రష్దీని చంపినవాళ్లకు నగదు బహుమతి ఇస్తామని కొన్ని మత సంస్థలు కూడా ప్రకటించాయి. దీంతో 9 ఏండ్ల పాటు రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లారు.

రష్డీపై దాడి షాక్కు గురిచేసింది: శశిధరూర్
న్యూయార్క్ లో సల్మాన్ రష్డీపై జరిగిన దాడి తనను షాక్ కు గురిచేసిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఆయన విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత భావ వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు స్వేచ్ఛలేకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.