
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో, కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్‌కు చేదు అనుభవం ఎదురైంది. విక్కీ కౌశల్‌పై సల్మాన్ తో సహా, ఆయన బాడీగార్డ్స్ దురుసుగా ప్రవర్తించారు. IIFA 2023 అవార్డు వేడుకకి బాడీవుడ్ నుండి పలువురు స్టార్స్ హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలో ఓ అభిమాని విక్కీతో సెల్ఫీ దిగుతుండగా అక్కడికి సల్మాన్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. సల్మాన్ రావడంతో అయన బాడీగార్డ్స్ అత్యుత్సాహంతో విక్కీ కౌశల్‌ను పక్కకు నెట్టివేశారు. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా సల్మాన్‌ను పలకరించేందుకు ముందుకు వెళ్ళాడు విక్కీ. కానీ సల్మాన్ మాత్రం అదేమీ పట్టనట్లుగా, సరిగా మాట్లాడకుండానే అక్కడినుండి వెళ్లిపోయాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సల్మాన్‌ఖాన్ బాడీగార్డ్స్ తీరుపై మండిపడుతున్నారు. తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో కూడా సల్మాన్‌కు తెలియదా? అంత మర్యాద లేదా అంటూ ఫైర్ అవుతున్నారు.