ఏఐపై గుత్తాధిపత్యం వద్దు:ఓపెన్ ఏఐ సీఈఓ సామ్

ఏఐపై గుత్తాధిపత్యం వద్దు:ఓపెన్ ఏఐ సీఈఓ సామ్

ఏఐ శక్తి ఒకే దేశం లేదా ఒకే సంస్థ చేతుల్లోనే ఉండటంపై చాట్​జీపీటీ  పేరెంట్ ​కంపెనీ ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ప్రజాస్వామీకరించడమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.  ఏఐ శక్తి కొద్దిమంది దగ్గరే ఉంటే అది భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ టెక్నాలజీను ప్రజల చేతుల్లోకి తీసుకెళ్లడం కొన్ని ఇబ్బందులు ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. 

తమ సంస్థ ఇటరేటివ్ డిప్లాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వ్యూహాన్ని అనుసరిస్తోందని చెప్పారు. దీనివల్ల ప్రజలు ఏఐ ఆవిష్కరణలను లోతుగా అర్థం చేసుకోవడానికి, అవి అసంపూర్తిగా ఉన్నా వాడుకోవడానికి వీలవుతుందన్నారు. లోపాలు ఉన్నప్పటికీ టెక్నాలజీను అందిస్తూనే ప్రజలను సాధికారత వైపు నడిపించాలని పేర్కొన్నారు. టీసీఎస్‌‌‌‌‌‌‌‌,  ఓపెన్ఏఐ జత ఏఐ వాడకాన్ని పెంచేందుకు ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐ, టీసీఎస్‌‌‌‌‌‌‌‌ జత కట్టాయి.  ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐకి చెందిన ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ ఏఐని టీసీఎస్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు పొందనుండగా,  ఓపెన్‌‌‌‌‌‌‌‌ ఏఐ కోడెక్స్‌‌‌‌ సామర్థ్యాలను టీసీఎస్ వాడుతుంది.