ఓపెన్‌‌ ఏఐ సీఈఓగా మళ్లీ ఆల్ట్‌‌మనే...

ఓపెన్‌‌ ఏఐ సీఈఓగా మళ్లీ ఆల్ట్‌‌మనే...
  • కొంత మంది బోర్డు మెంబర్లు మారడంతో పాటు, సత్య నాదెళ్ల సపోర్ట్‌‌తో  రీఎంట్రీ

న్యూఢిల్లీ: లీడర్‌‌‌‌షిప్ బాగోలేదని శామ్‌‌ ఆల్ట్‌‌మన్‌‌ను  తీసేసిన ఓపెన్ ఏఐ బోర్డ్ తిరిగి ఆయన్ని సీఈఓగా నియమించింది. ఉద్యోగులు, ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో కంపెనీ బోర్డ్ దిగొచ్చింది.  సీఈఓగా ఆల్ట్‌‌మన్ తిరిగొచ్చేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని ఓపెన్‌‌ ఏఐ ట్వీట్ చేసింది. సేల్స్‌‌ఫోర్స్‌‌ మాజీ సీఈఓ బ్రెట్ టేలర్‌‌‌‌, మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్‌‌ కంపెనీ బోర్డులో జాయిన్ కానున్నారు.

క్వరా సీఈఓ ఆడమ్‌‌  డీఆంగ్లో  బోర్డులో కొనసాగుతారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, కొంత మంది బోర్డు మెంబర్ల సపోర్ట్‌‌తో ఓపెన్ ఏఐలోకి తిరిగొస్తున్నానని ఆల్ట్‌‌మన్ పేర్కొన్నారు.  ఓపెన్ ఏఐ బోర్డ్‌‌లో మార్పులు రావడంపై  సత్యనాదెళ్ల స్పందించారు. కంపెనీ బోర్డ్ స్టేబుల్‌‌గా ఉంటుందని అన్నారు.