సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ల ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ విడుదల..అభ్యంతరాలకు 13 వరకు అవకాశం

సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ల ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ విడుదల..అభ్యంతరాలకు 13 వరకు అవకాశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సమగ్ర శిక్ష కింద జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసులు, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్, డీఈఓ ఆఫీసులో కో ఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ సైన్స్ కో ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఆన్‌‌లైన్ పరీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ విడుదల చేసింది. 

అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ షీట్లు, కీని శనివారం నుంచి అధికారిక వెబ్‌‌సైట్ www.schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టు సమగ్రశిక్ష ఎస్​పీడీ నవీన్ నికోలస్ తెలిపారు. అభ్యర్థులు వీటిని డౌన్‌‌లోడ్ చేసుకొని పరిశీలించుకోవచ్చని, కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల13 వరకు ఆన్‌‌లైన్ ద్వారా తెలపాలని ఆయన సూచించారు. కాగా, ఈ పరీక్షకు 1168 మంది అప్లై చేసుకోగా, 866 మంది పరీక్ష రాశారు.