వాషింగ్టన్: నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నవీని ‘అమెరికా ద్రోహి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడిన వెంటనే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నవీని అభినందిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది.
అందులో పిళ్లై చుట్టూ ఉన్నవారంతా ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొడుతున్నారు. ఆ సందర్భంలో పిళ్లై ‘మీరు ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడితే నేను నా నోబెల్ ప్రైజ్‌ను ట్రంప్‌తో పంచుకోవచ్చేమో!’ అని సెటైరికల్‌గా కామెంట్ చేశారు. అయితే దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. నోబెల్ కమిటీ నిర్ణయం నోబెల్ బహుమతి గౌరవాన్ని మంటగలిపిందని విమర్శించారు.
