
తెలుగు ప్రముఖ హీరోయిన్ సమంత సిటాడెల్: హనీ బన్నీ (Citadel Honey Bunny) అనే వెబ్ సీరీస్లో నటిస్తున్న విషయం తెలిసందే. ఈ వెబ్ సీరీస్లో బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా స్పై థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో రాజ్ & డికె (రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డికె) తెరకెక్కించారు.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలైన డి2ఆర్ ఫిల్మ్స్ మరియు అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కలసి సంయుక్తంగా నిర్మించాయి. అయితే ఇటీవలే సిటాడెల్ ట్రైలర్ని యూట్యూబ్లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్కు రానుండగా.. తాజాగా మరో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
వరుణ్, సామ్ కలిసి చేసే యాక్షన్ సీన్స్ హైలెట్గా ఉన్నాయి. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్ లేకుండా సామ్ స్వయంగా యాక్షన్ సీక్వెన్స్లో తన స్టంట్స్తో సామ్ అదరగొట్టింది. అయితే, ఇందులో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా..కొన్ని ఎమోషన్స్ని కూడా పలికించారు సామ్.
బన్నీక్యారెక్టర్ చేసిన వరుణ్ ధావన్ ఎంట్రీతో ఈ ట్రైలర్ షూర్ అవుతోంది. తాము చేస్తున్నది తప్పని తెలిసినా.. చేయక తప్పదంటూ వరుణ్ ఎంట్రీతో ఆసక్తి క్రియేట్ చేశారు. ఆ తర్వాత తన కూతురిని కాపాడుకోవడానికి ప్రయత్నించే పాత్రలో సమంత ఇంపాక్ట్గా చేసింది.
ALSO READ : ఆ అవార్డును తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు: ఏఎన్నార్ శత జయంతి వేడుకలో చిరంజీవి
అయితే ఎప్పుడూ కూల్ హీరోయిన్గా గ్లామర్ పాత్రల్లో కనిపించిన సమంత ఈసారి సిటాడెల్లో డిఫరెంట్ రోల్లో యాక్షన్ క్వీన్గా కనిపించింది. అయితే యాక్షన్ సన్నివేశాలు, కొంచెం ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటోంది.
హాలీవుడ్‌లో వచ్చిన సిటాడెల్’ సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్. దీనికి సిటాడెల్: హనీ బన్నీ అనే పేరు పెట్టారు. ఇంతకుముందు ఇదే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి వారితో కలిసి పనిచేస్తోంది. దాంతో సామ్ ఖాతాలో మరోహిట్ పక్కా అనేలా ట్రైలర్ విజువల్స్ చెబుతున్నాయి.