Samantha: కన్నీళ్లతోనే హీరోయిన్ సమంత స్పీచ్.. వీడియో వైరల్..

Samantha: కన్నీళ్లతోనే హీరోయిన్ సమంత స్పీచ్.. వీడియో వైరల్..

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA 2025) ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. మూడు రోజులు సైతం ఈ వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరోయిన్ సమంత హాజరయ్యి స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. తనపై అభిమానులు చూపిస్తోన్న అపారమైన ప్రేమపట్ల సమంత భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ.. ‘‘ తానా వేడుకల్లో పాల్గొనడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈ వేదికపై నిలబడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా మొదటి సినిమా ఏమాయే చేసావే నుండే నన్ను మీ సొంతం చేసుకున్నారు. జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఏదైనా తప్పు చేసినా.. మీరు ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. అందుకు ఎంతోగానూ గర్వపడుతున్నా. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా, ఏ పరిశ్రమలో పనిచేసినా.. తెలుగు ప్రేక్షకులు నన్ను చూసి గర్వపడతారా? లేదా? అనే ఆలోచిస్తాను. ఓ బేబీ మిలియన్ డాలర్లు సంపాదించానని గుర్తుంది. నేను దానిని నమ్మలేకపోయాను.

►ALSO READ | Soloboy: బిగ్‌బాస్ గౌత‌మ్ కృష్ణ ‘సోలో బాయ్’.. మౌత్ టాక్‌‌‌‌తో మరింత ముందుకు

ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీరు నాకు దూరంగా ఉన్నప్పటికీ నా హృదయంలో మాత్రం ఉన్నారు. మీరు నాకొక ఐడెంటిటీ, కుటుంబాన్ని ఇచ్చారు. మీకెప్పటికీ ఋణపడిఉంటానంటూ’’ సామ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సమంత ఒకపక్క సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ మరోపక్క బిజినెస్ లో కూడా పెట్టుబడులు పెడుతూ బిజిబిజీగా గడుపుతోంది. అలా సమంత నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’.‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకత్వం వహించాడు. వసంత్ మరిగంటి కథను అందించాడు. శుభం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.