
‘బిగ్‌బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్‌గా నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించిన చిత్రం ‘సోలో బాయ్’. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ నిర్వహించారు.
గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘ఒక మంచి సినిమా చూశామని ప్రేక్షకులు చెప్పడం ఎమోషనల్‌గా అనిపించింది. కంటెంటే హీరో అని మరోసారి నిరూపించారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. సినిమాకొస్తున్న రెస్పాన్స్ ఆనందాన్ని ఇచ్చిందని శ్వేత అవస్తి చెప్పింది.
►ALSO READ | Rashmika Mandanna: రష్మిక మందన్న‘ది గర్ల్ ఫ్రెండ్’.. రిలీజ్ డేట్ & ఫస్ట్ సింగిల్ అప్డేట్
తమ చిత్రాన్ని సోల్ ఫుల్ హిట్‌గా నిలిపిన ఆడియెన్స్‌కు దర్శకుడు నవీన్ కుమార్ ధన్యవాదాలు చెప్పాడు. మౌత్ టాక్‌తో సినిమాకు మరింత ఆదరణ దక్కుతోందని నిర్మాత సతీష్ అన్నారు. నటి అనిత చౌదరి, లిరిసిస్ట్ పూర్ణాచారి సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
సోలో బాయ్ కథ:
మిడిల్‌క్లాస్ నుంచి మిలియనీర్స్‌గా మారిన వారి కథలు అప్పుడప్పుడు పేపర్లలో, టీవీల్లో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన సినిమానే సోలో బాయ్. విఫల ప్రేమలు, కష్టాలను, కన్నీళ్లను దాటుకుంటూ ఓ మిడిల్ క్లాస్ యువకుడు కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్నదే ఈ సినిమా కథ.