Rashmika Mandanna: రష్మిక మందన్న‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’.. రిలీజ్ డేట్ & ఫస్ట్ సింగిల్ అప్డేట్

Rashmika Mandanna: రష్మిక మందన్న‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’.. రిలీజ్ డేట్ & ఫస్ట్ సింగిల్ అప్డేట్

రష్మిక మందన్న లీడ్ రోల్‌‌లో నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’. నటుడు రాహుల్ రవీంద్రన్‌‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ బ్యూటిఫుల్‌‌ లవ్‌‌స్టోరీలో రష్మికకు జంటగా దీక్షిత్‌‌ శెట్టి నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం  రష్మిక, దీక్షిత్ శెట్టి జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. టాకీ పార్ట్‌‌ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.  షూటింగ్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో ఈ నెలలోనే పాటను విడుదల చేయడంతో పాటు సినిమా రిలీజ్ డేట్‌‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

రష్మిక మందన్న గత నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటుంది. యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర సినిమాలతో మంచి సక్సెస్ జోష్లో ఉంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్కు సాధ్యం కాని రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో' మరియు 'పుష్ప 3', మైసా మూవీస్ తో పాటుగా మరిన్ని లైన్లో ఉన్నాయి.