Shah rukh, Samantha: బాలీవుడ్ బెస్ట్ జోడీ.. షారుఖ్ సినిమాలో హీరోయిన్గా సమంత

Shah rukh, Samantha: బాలీవుడ్ బెస్ట్ జోడీ.. షారుఖ్ సినిమాలో హీరోయిన్గా సమంత

సౌత్ బ్యూటీ సమంత బంపర్ ఆఫర్ కొట్టేశారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈ జోడీ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ త్వరలో షారుఖ్ తో ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో రానుంది. 

తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్టులో సమంతను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట మేకర్స్. ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ లో ఇదే టాప్ జోడీ అయ్యే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తోంది. ఇక రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ కాంబోలో ఇటీవలే డంకీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.మంచి సందేశంతో, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను  అంతగా ఆకట్టుకోలేదు. సినిమాలో షారుఖ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి కానీ, కమర్షియల్ గా సక్సెస్ కాలేదు డంకీ. 

అందుకే.. ఆ ప్లాప్ నుండి బయటకు రావడానీకె దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తన నెక్స్ట్ సినిమాను కూడా షారుఖ్ తో ప్లాన్ చేస్తున్నాడట. యాక్షన్ అడ్వెంచర్ అండ్ దేశభక్తి కాన్సెప్ట్ తో ఈ కొత్త సినిమా తెరకెక్కనుందట. ఈసారి షారుఖ్ తో ఖచ్చితంగా హిట్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయ్యాడట రాజ్ కుమార్ హిరానీ. అందుకే.. ఆయనకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథను సిద్ధం చేశాడట. కథ విన్నాక షారుఖ్ కూడా ఈ సినిమా వెంటనే చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.