Samantha: నిర్మాతల కష్టం తెలిసొచ్చింది.. ఆడ, మగ..సేమ్ రెమ్యూనరేషన్‌.. సమంత ఆసక్తికర కామెంట్స్..

Samantha: నిర్మాతల కష్టం తెలిసొచ్చింది.. ఆడ, మగ..సేమ్ రెమ్యూనరేషన్‌.. సమంత ఆసక్తికర కామెంట్స్..

స్టార్ హీరోయిన్‌‌‌‌గా ఎన్నో సక్సెస్‌‌‌‌లు చూసిన సమంత.. ఇప్పుడు నిర్మాతగా అడుగులు వేస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఆమె నిర్మించిన చిత్రం ‘శుభం’. కొత్త నటీనటులతో ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమంత ఇలా ముచ్చటించింది. 

ఆ తపన, కోరికతో.. 

‘ఒక నటిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నాను, ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం నా మనసులో ఉండేది. ఎప్పుడైతే సాఫీగా సాగుతున్న నా యాక్టింగ్‌‌‌‌‌‌‌‌ జర్నీ అనారోగ్య కారణాల వల్ల ఒక్కసారిగా ఆగిందో.. అప్పుడు నా మనసు చెపుతున్నది స్పష్టంగా విన్నాను.

Also Read :  వి సెల్యూట్ ఇండియన్ ఆర్మీ

నేను మళ్లీ నటిగా కొనసాగుతానో లేదో ఆ సమయంలో నాకు స్పష్టత లేదు. ఒకవేళ ఇకపై నటించకపోతే నిర్మాతగా కొనసాగాలి అని డిసైడ్ అయ్యాను. రిస్క్ అయినప్పటికీ ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉన్న నా అనుభవం కూడా దీనికి తోడవుతుందని భావించాను.

బ్రౌన్‌‌‌‌ గర్ల్‌‌‌‌ నేనే:

అలా మొదలైన ఈ సినిమా ఎనిమిది నెలల్లో పూర్తయింది.  ఇప్పుడు రిలీజ్‌‌‌‌కు రెడీ అయింది.  సినిమా గురించి ఎక్కువగా మాట్లాడకుండా చేతల్లో చూపించాలని వర్క్ చేశాం. టీవీ సీరియల్‌‌‌‌లో శుభం కార్డు కోసం ఎంతలా ఎదురుచూస్తామో తెలిసిందే. ఆ నేపథ్యంలో సాగే సినిమా కనుక ‘శుభం’ టైటిల్ పెట్టాం. ఇక ‘ట్రాలాలా.. బ్రౌన్‌‌‌‌ గర్ల్‌‌‌‌ ఇన్‌‌‌‌ ద రింగ్‌‌‌‌..’  అనేది నేను చిన్నప్పుడు విన్న పాట.. అందుకే నా బ్యానర్‌‌‌‌‌‌‌‌కు ఈ టైటిల్‌‌‌‌ పెట్టాను. ఆ బ్రౌన్‌‌‌‌ గర్ల్‌‌‌‌ ను నేనే. 

కొత్త కథలు, కొత్త వాళ్లకు ప్రోత్సాహం:

నా బ్యానర్‌‌‌‌‌‌‌‌లో నిర్మించే మొదటి సినిమాలో నేను లీడ్ రోల్ చేయకూడదని ముందే ఫిక్స్‌‌‌‌ అయ్యా. ఎందుకంటే గౌతమ్‌‌‌‌ మీనన్ గారి రూపంలో నాకు అవకాశం వచ్చింది. అలాగే ఇప్పుడు మరికొందరికి అవకాశం ఇవ్వడం నా బాధ్యతగా ఫీలయ్యా.అలా కొత్త కథలు చెప్పడమే కాదు కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని ఇది స్టార్ట్‌‌‌‌ చేశా. 

సినిమా కోసం జీవితంలో ఎన్నో వదులుకుని, మరెన్నో కష్టాలు పడి, కోటి ఆశలతో ఇండస్ట్రీకి వస్తారు.  వాళ్ల జర్నీలో నేను ఓ పార్ట్‌‌‌‌ అవడం సంతోషంగా, గర్వంగా అనిపించింది. వాళ్లను చూస్తుంటే నేను మొదటి సినిమాకు ఆడిషన్‌‌‌‌ చేసిన రోజులు, ఆ ఎమోషన్స్‌‌‌‌ గుర్తొచ్చాయి.   

అలాంటి ఫేవర్స్‌‌‌‌ అడగలేను:

ఇప్పటివరకు మా సినిమా చూసిన ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్‌‌‌‌ ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ వచ్చింది. మంచి సినిమా, మంచి కథ, చాలా బాగా వచ్చింది.  విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఇక నేను పోషించిన పాత్ర స్క్రిప్ట్‌‌‌‌ దశ నుంచి సినిమాలో ఉంది. కానీ నాకోసం రాసిన పాత్ర కాదు. మరెవరితోనైనా అనుకున్నాం. కానీ అలా ఫేవర్స్‌‌‌‌ అడగటం కష్టం.. నాకు రాదు కూడా. అందుకే నేనే చేశాను.  

ఆడ, మగ.. సేమ్ రెమ్యూనరేషన్‌‌‌‌:

ఒకే తరహా స్కిల్స్‌‌‌‌, ఒకే ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ ఉన్న వాళ్లు.. మగ అయినా, ఆడ అయినా సమానమైన రెమ్యూనరేషన్‌‌‌‌ ఇవ్వాలనేది నా డ్రీమ్. ఇందులో అందరూ కొత్త వాళ్లు కనుక ఒకే పారితోషికం ఇచ్చాను. రాబోయే సినిమాల రిక్వైర్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌ను బట్టి ఇది మారచ్చేమో. కానీ సాధ్యమైనంత వరకు ఈక్వల్‌‌‌‌ స్కిల్, ఈక్వల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌, ఈక్వల్ పే అన్నదే ఫాలో అవుతాను. 

ఆ ప్రేమను గౌరవిస్తా.. కానీ ప్రోత్సహించను:

ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయా. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నారా అనిపించింది. దీని గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ప్రేమను చూపించే తీరు అది. ఆ ప్రేమను గౌరవిస్తా. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి పూజలు చేసే పద్దతిని మాత్రం ఎంకరేజ్ చేయలేను. ఇక నా పర్సనల్‌‌‌‌ విషయాలు ఎక్కడా మాట్లాడకూడదని ఫిక్స్‌‌‌‌ అయ్యా. లైఫ్‌‌‌‌లో అది మాత్రం నాకు బాగా అర్థమైంది. (నవ్వుతూ)

జూన్ నుంచి మళ్లీ షూటింగ్స్‌‌‌‌తో:

ప్రస్తుతం లీడ్ రోల్‌‌‌‌లో ‘మా ఇంటి బంగారం’అనే సినిమా చేస్తున్నా. జూన్ నుంచి మళ్లీ షూట్‌‌‌‌కు వెళ్తున్నాం. ఇక దర్శకుడు అట్లీ నాకు మంచి ఫ్రెండ్. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి. కానీ ఇప్పట్లో (అల్లు అర్జున్‌‌‌‌ సినిమా గురించి) తనతో కలిసి వర్క్ చేయడం లేదు. 

నా మనసుకు నచ్చిందే చేస్తా:

నేనొక స్మార్ట్ ప్రొడ్యూసర్‌‌‌‌ని కాకపోవచ్చు.. బిజినెస్ గురించి అంతగా తెలియకపోవచ్చు.. కానీ నా మనసుకు నచ్చింది కాబట్టి ఈ సినిమా చేశాను. నేను ఎప్పుడైనా నా మనసుకు నచ్చిందే చేస్తాను.  అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని చెప్పగలను.

నిర్మాతల కష్టం తెలిసొచ్చింది:

నిర్మాతగా ఓ సినిమాను ప్రొడ్యూస్‌‌‌‌ చేయడం ఎంత కష్టమో ఈ చిత్రంతో అర్థమైంది. ఇప్పటివరకు నేను ప్రొడ్యూసర్స్‌‌‌‌ యాక్ట్రెస్‌‌‌‌ను అనుకున్నాను. కానీ ఈ సినిమాను నిర్మించాక అది సరిపోదు అనిపించింది. ఇంకాస్త ఎక్కువ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉండాలని అర్థమైంది.

ఒక్కోసారి నటీనటుల తప్పిదం కావొచ్చు, స్క్రిప్ట్‌‌‌‌లో మార్పులు కావొచ్చు ఆరోజు తీయాల్సిన ఒక్క సీన్‌‌‌‌ మిస్‌‌‌‌ అయినా చాలా టైమ్ వేస్ట్ అవుతుంది. ఫలితంగా ప్రొడక్షన్‌‌‌‌ కాస్ట్ పెరుగుతుంది. ఓ నటిగా నా వైపు నుంచి ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాను.