Samantha Dating: దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి.. రూమర్స్పై రంగంలో దిగిన సామ్ మేనేజర్!

Samantha Dating: దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి.. రూమర్స్పై రంగంలో దిగిన సామ్ మేనేజర్!

హీరోయిన్ సమంత.. చిత్రనిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతకొన్నాళ్లుగా వీరిమధ్య రూమర్స్ ఊపందుకున్నాయి. త్వరలొ వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో బలమైన టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో రూమర్స్పై క్లారిటీ ఇవ్వడానికి సమంత మేనేజర్ రంగంలోకి దిగారు. పలు నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ వార్తలన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమేనని, కలిసి సినిమాలు చేస్తే రిలేషన్లో ఉన్నట్లు కాదని ఆయన ఖండించారు. ఇక ఇపుడు సమంత మేనేజర్ చేసిన ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు రూమర్స్ ఆపేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

సమంత ఇటీవల తన నిర్మాణ సంస్థ నుంచి శుభం మూవీ రిలీజ్ చేసింది. ఈ సినిమా విశేషాలు పంచుకుంటూ పలు ఫొటోస్ షేర్ చేసింది. అందులో డైరెక్టర్ రాజ్ కూడా ఉండటం, అతనితో సమంత క్లోజ్గా ఉండటం నెటిజన్లని ఆకర్షించేలా చేసింది. దాంతో వీరిద్దరి మధ్య పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. అంతేకాకుండా లేటెస్ట్గా రాజ్ భార్య చేసిన పోస్ట్ సైతం సమంతకు లింక్ చేస్తూ పెట్టినట్లుగా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shhyamali De (@shhyamalide)

డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి (Shhyamali)ఇన్స్టాలో ఓ స్టోరీ పోస్ట్ చేస్తూ.. ‘‘నా గురించి ఆలోచించి, విని, మాట్లాడేవారితోపాటు నన్ను కలిసి, నాతో మాట్లాడి, నా గురించి రాసే వారందరికీ ప్రేమ, ఆశీస్సులు పంపుతున్నా’’అంటూ నోట్ షేర్ చేసింది. 

ఇప్పుడీ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, సమంత మరియు రాజ్ నిడిమోరు ఈ డేటింగ్, పెళ్లి ఊహాగానాలపై ఇప్పటివరకు స్పందించలేదు. చూడాలి మరి.. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్లి ఎక్కడ ఆగుతుందో!