మా ఇంటి బంగారం ముచ్చట్లు ఇవే అంటున్న సమంత

మా ఇంటి బంగారం ముచ్చట్లు ఇవే అంటున్న సమంత

ఆరోగ్య సమస్యలతో సినిమాలకు గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన సమంత కొంత విరామం తర్వాత తిరిగి షూటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయింది. తను హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’.  ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సమంతనే నిర్మిస్తోంది. గత ఏడాది తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

అయితే డైరెక్టర్ ఎవరు.. ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది అనేది ప్రకటించలేదు.  సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండే సమంత.. ఈ నెలలోనే షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం కాబోతోందని ఇటీవల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. చెప్పినట్టుగానే తాజాగా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినట్టు సమాచారం.

 బుధవారం (అక్టోబర్ 22) నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ జరుగుతోందని, నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తోందని తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలను టీమ్ వెల్లడించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేతిలో గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకున్న గృహిణిగా కనిపించిన సమంత.. ఇందులో ఇలాంటి పాత్ర చేయబోతోందా, ఈ మూవీ ఏ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండబోతోందా అనే ఆసక్తి నెలకొంది.