బ్రేక్.. బ్యాడ్‌‌ కాదు : సమంత

బ్రేక్.. బ్యాడ్‌‌ కాదు : సమంత

ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన సమంత..  చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండకి జంటగా ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అలాగే రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న హిందీ వెబ్ సిరీస్‌‌ ‘సిటాడెల్’ షూటింగ్ గురువారం కంప్లీట్ అయింది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సమంత. అంతేకాదు.. కెరీర్‌‌‌‌లో బ్రేక్‌‌ ఇవ్వబోతున్న విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘జులై 13.. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజుతో ‘సిటాడెల్’ షూటింగ్ పూర్తయింది.

ఏమి జరుగుతుందో మీకు తెలిసినప్పుడు.. బ్రేక్ అనేది చెడ్డ విషయంగా అనిపించదు’ అని పోస్ట్ చేసిందామె. ఇక శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గత కొన్నాళ్లుగా మయోసైటిస్‌‌తో బాధపడుతున్న సమంత.. ట్రీట్మెంట్‌‌ కోసం కెరీర్‌‌‌‌లో బ్రేక్ తీసుకుంటోంది.