
పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకుని, తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత. ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కమిటవుతూనే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకూ ఓకే చెబుతున్నట్లు తెలిసింది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సమంత ఓకే చెప్పిందని సమాచారం. వచ్చే వారం ఈ సాంగ్ షూటింగ్ జరగనుందట. మరోవైపు మహేష్ బాబుతో రాజమౌళి తీసే చిత్రంలో సమంతను తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇప్పటికే మహేష్‌కి జంటగా మూడుసార్లు నటించిన సమంత నాలుగోసారి స్ర్కీన్ షేర్ చేసుకోనుందన్నమాట. ఇదిలా ఉంటే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లోనూ సమంత నటించనున్నట్లు న్యూస్ అందుతోంది. ఆమధ్య సమంతతో ‘ఓ బేబి’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సునీత తాటి నిర్మిస్తున్న మూవీలో సామ్ లీడ్ రోల్ చేస్తోందని అంటున్నారు. అలాగే తాప్సీ నిర్మించే చిత్రంతో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలూ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సమంత పేరు వినిపిస్తోంది. వీటిలో ఏవి ఫైనల్ అవుతాయో!