
తొలిచిత్రంతోనే హీరోయిన్‌గా ఆకట్టుకుని స్టార్ హీరోయిన్‌గా రాణించిన సమంత.. నిర్మాతగానూ తొలిప్రయత్నంలోనే విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్‌గా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూసిన అభిమానులు.. మునుపటి సమంతను చూస్తున్నాం అంటూ ఖుషీ అవుతున్నారు. తాజాగా వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2025 ఈవెంట్‌లో ఇలా కట్ అవుట్ షేప్స్‌తో కూడిన చాక్‌లెట్ బ్రౌన్ కలర్ కాస్ట్యూమ్స్‌లో మెరిసింది సమంత. సైడ్స్‌లో జిగ్ జాగ్ షేప్‌లో శరీరం కనిపించేలా ఓవెన్ డిటైలింగ్‌తో కూడిన కట్స్ ఆమె కాస్ట్యూమ్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
క్రేషా బజాజ్ డిజైన్ చేసిన ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో ఆమె మరింత అందంగా కనిపించింది. మ్యాచింగ్ హీల్స్, కాపర్ ఐ షాడో, న్యూట్రల్ మేకప్, లూజ్ హెయిర్, గోల్డ్ ఇయర్ రింగ్స్‌తో స్టన్నింగ్ లుక్స్‌లో ఇంప్రెస్ చేసింది. మునుపటి కంటే బరువు తగ్గి స్టన్నింగ్ ట్రాన్‌ఫర్మేషన్‌తో ఆశ్చర్యపరిచింది.
ఈ అవార్డుల వేడుకకు చాలామంది సెలబ్రిటీస్ వచ్చినప్పటికీ తన లుక్‌తో సమంత షో టాపర్‌గా ఆకట్టుకుంది. ఈవెంట్‌లో ఆమె న్యూ లుక్‌కు సంబంధించిన ఫొటోస్, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.