
హీరోయిన్ సమంత నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘శుభం’. త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ఆమె.. ఫస్ట్ మూవీగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకత్వం వహించాడు. మే 9న సినిమా రిలీజ్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. శనివారం ‘జన్మ జన్మల బంధం’ అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
నటులు హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణిలతో పాటు సమంత ఆడి పాడిన ఈ పాట ఆకట్టుకుంది. ‘ముగిసిపోనుంది ఇక భయమే.. చివరికి ఇక సుఖమే.. ముందు జరిగేదంతా శుభమే.. చెయ్యి సంబరమే.. కష్టమంతా కరిగిపోయే రోజు వచ్చింది.. ఇక కానుంది ఈ కథ సుఖాంతం.. పాలు నీళ్ల బంధం.. ఇది జన్మ జన్మల బంధం’ అంటూ సాగిన పాట సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. విజువల్స్, మ్యూజిక్ ఇంప్రెస్ చేస్తున్నాయి.