కామారెడ్డిలో మెరిసిన సమంత

కామారెడ్డిలో మెరిసిన సమంత

కామారెడ్డి లో నటి సమంత సందడి చేశారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఓ షాపింగ్ మాల్ ను  సమంత ప్రారంభించారు. జ్యోతి వెలిగించి… సంప్రదాయ బద్దంగా మాల్ ను లాంచ్ చేశారు. అక్కడి కలెక్షన్స్ ను పరిశీలించారు. కొన్ని శారీస్ ను ప్రదర్శించి.. ఫొటోలకు పోజులిచ్చారు. పట్టణాలు కూడా.. నగరాల్లాగే డెవలప్ అవుతున్నాయని… ఇది చాలా మంచి పరిణామం అని అన్నారు సమంత.

ఎమ్మెల్యే గంప గోవర్దన్ తో కలిసి మాల్ లోని ఫ్లోర్లను పరిశీలించారు సమంత. హీరోయిన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో.. నిజాంసాగర్ చౌరస్తా సందడిగా మారింది.