
పాకిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు, కొండచరియలు విరిగి పడటంతో ఇప్పటివరకు 24 మందికి పైగానే మరణించారు, అలాగే చాల మంది వరదలు కొట్టుకుపోయారు. మరోవైపు రోడ్లు తెగిపోవడం, వంతెనలు కొట్టుకుపోవడం, నదుల నీటి మట్టం పెరగడం వల్ల చాలా ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా మారింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్ జిల్లాలు అత్యధికంగా దెబ్బతిన్నాయి. లోయర్ దిర్‌లోని మైదాన్ సోరి పావో ప్రాంతంలో ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమీప ప్రాంతాలలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లులు దెబ్బతిన్నాయి. బజౌర్ జిల్లాలోని జబ్రారి, సలార్జాయ్ ప్రాంతాలలో మేఘాల విస్ఫోటనం వల్ల వరదల్లో తొమ్మిది మంది మరణించగా, 17 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.
గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని గిజర్ జిల్లాలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించగా, కొందరు గల్లంతయ్యారు. ఈ విపత్తులో డజన్ల కొద్దీ ఇళ్ళు, స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు ధ్వంసమయ్యాయి. కారకోరం, బాల్టిస్తాన్ రహదారులు చాలా చోట్ల మూసేసారు, దింతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. నీలం లోయలో కూడా పరిస్థితి తీవ్రంగా ఉంది, ఇక్కడ రట్టి గాలి సరస్సు సమీపంలో 600 మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. చాల వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు కూడా తెగిపోయాయి.
►ALSO READ | ట్రంప్–పుతిన్ చర్చలు ఫెయిల్ అయితే ఇండియాపై మరిన్ని టారిఫ్‌లు: స్కాట్ బెసెంట్
వీటికి తోడు నీలం నది నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది, దింతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను హెచ్చరించింది. పాకిస్తాన్ ముఖ్యమంత్రి అలీ అమీన్ గందాపూర్ అన్ని జిల్లాలను హై అలర్ట్‌లో ఉంచాలని, అలాగే సహాయ చర్యలలో మొత్తం అధికారులను ఉంచాలని ఆదేశించారు. మలకంద్, బజౌర్ అధికారులను సంఘటన స్థలాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోరారు. సహాయక చర్యల కోసం ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా పంపగా, అనవసర ప్రయాణాలను నివారించాలని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.