Samantha Health Podcast: సామ్ టేక్ 20..ఎపిసోడ్1 వీడియో వచ్చేసింది

Samantha Health Podcast:  సామ్ టేక్ 20..ఎపిసోడ్1 వీడియో వచ్చేసింది

టాలీవుడ్ స్టార్​హీరోయిన్​సమంత (Samantha) సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్తో ఎప్పుడు టచ్లో ఉంటారు.నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ చేసిన..చాలా మీనింగ్ ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తుండటం విశేషం. కొంత కాలంగా మాయో సైటిస్ (Myositis) వ్యాధితో బాధపడుతున్న సమంత (Samantha) సినిమాలకు బ్రేక్ ఇచ్చి పలు డిఫరెంట్ ట్రిప్స్ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్గా ట్రీట్ మెంట్ పూర్తీ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన సమంత ఇన్స్టా వేదికగా పలు విశేషాలను పంచుకోనుంది. 

రీసెంట్గా సామ్ టేక్ 20(Take 20) అనే హెల్త్ పాడ్ క్యాస్ట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. లేటెస్ట్గా సామ్ టేక్ 20 ఎపిసోడ్1 కి సంబంధించిన వీడియోను సమంత యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో స్వయం ప్రతిరక్షక శక్తిని అర్థం చేసుకోవడం (Understanding Autoimmunity) అనే అంశంపై అల్కేష్ తో సామ్ పాడ్ క్యాస్ట్ నిర్వహించారు. 

ఈ లేటెస్ట్ షోలో సామ్ స్పందిస్తూ.. 'నాకు బాగా గుర్తుంది. నాకు మాయోసైటిస్ సమస్య రావడానికి సరిగ్గా ఏడాది ముందు నాకు ఎంతో కష్టంగా గడిచింది. ఇక రీసెంట్గా నేను నా మేనేజర్ హిమాంక్ తో ముంబాయ్ నుండి ప్రయాణిస్తున్న సమయంలో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని తనతో చెప్పాను. ఎందుకంటే..చాలాకాలంగా నేను ఇంత ప్రశాంతంగా లేనని కూడా అన్నాను. ఫైనల్గా నేను ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నాను, తృప్తిగా నిద్రపోగలుగుతున్నాను, లేచి నా పనిపైన దృష్టి పెట్టగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. 

సామ్ టేక్ 20 లో కేవలం హెల్త్కి సంబంధించిన విషయాలను, ఎన్నో తెలియని వ్యాధులకు సమాధానాలు తెలుపుటయే పాడ్ క్యాస్ట్ యొక్క ముఖ్యోద్దేశ్యం అని తెలిసిందే. సమంత గత మూడేళ్ళుగా మాయో సైటిస్ వలన అనుభవించిన బాధ, దాన్ని నుంచి కోలుకుని..తాను ఎలా మాములు మనిషిలా అయ్యాననే విషయాలు ఇందులో చెప్పుకొచ్చింది.

ఇక సమంత సినిమాలు విషయానికొస్తే..ప్రసెంట్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ ఫిల్మ్ సిటాడెల్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.ఈ మూవీ అమెరికన్ టీవీ సిరీస్కు స్ఫూర్తిగా తెరక్కుతున్నట్లు తెలుస్తుంది. త్వరలో సమంత తన కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.