టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' మూవీతో బిజీగా ఉంది. నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. అయితే సామ్ కొద్దికాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే సమంత లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది
ఈ ముద్దుగుమ్మ జిమ్ లో పర్కవుట్ చేస్తున్న ఫొటోలను షేర్ చేస్తూ 'ఫుల్ యాక్షన్ మోడ్.. బీస్ట్ మోడ్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్నే ళ్ల క్రితం నా బ్యాక్ బలంగా లేదని వదిలేశా. ఎందుకంటే నా జీన్స్ లో అలా లేదని అనుకునే దాన్ని.. ఎవరివైనా అలాంటి వారిని చూసినప్పుడు.. నాకు అలా సాధ్యం కాదని అనుకుంటా. కానీ అదంతా తప్పని ఇప్పుడు తెలిసింది అని పోస్ట్ చేసింది.. నిజాయితీగా చెప్పాలంటే ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. దాన్ని ఇప్పుడు చూపించబోతున్న. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించా. బాడీలో కండరాన్ని ని ర్మించడం చాలా ముఖ్యమని సమంత చెప్పారు.
►ALSO READ | Bigg Boss 9: "కెప్టెన్ కాగానే కళ్లు నెత్తికెక్కాయా.. పొగరు తలకెక్కిందా?".. తనూజకు నాగార్జున సీరియస్ వార్నింగ్!
మీరు ఎలా కనిపిస్తారనే దాని కోసం మాత్రమే కాదు.. మీరు ఎలా జీవిస్తారు. ఎలా కదులుతారు.. మీ వయస్సు ఎలా పెరుగుతుందనే దాని కోసం అవసరమని సమంత చెప్పుకొచ్చారు.. మీ వయసు పెరిగే కొద్ది బలమైన శిక్షణే మీ బెస్ట్ ఫ్రెండ్ గా మారాలి. అదే నాడు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసింది. క్రమశిక్షణ. సహనం నేర్చింది అంటూ సమంత పోస్ట్ చేసిందిపే. కాగా.. ఇన్ స్టాలో సామ్ పోస్ట్ చేసిన ఈ ఫొటోలను లైకులు. కామెంట్ల వర్షం కురుస్తోంది. 'ఇంత స్ట్రాంగ్ లుక్ ఎన్నరూ చూడలేదు', 'సామ్ ఈజ్ బ్యాక్' అంటూ నెటిజన్లు ప్రశంస లు కురిపిస్తున్నారు.
