రాష్ట్రంలో పోడు భూముల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పోడు భూముల సాగుకు జిల్లా సమన్వయ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి జిల్లా ఇన్ చార్జ్ మంత్రిని చైర్మన్ గా నియమించింది. ఇందులో జిల్లా ఎస్పీ , ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లను సభ్యులుగా చేర్చింది.
అదనపు కలెక్టర్లు రెవెన్యూ, లోకల్ బాడీ, జిల్లా ఫారెస్ట్ అధికారి, డీఆర్డీఓ, డీటీడీఓలను సభ్యులుగా నియమించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోడు భూముల అంశంపై జిల్లా కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు.
