
ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సమత కేసు మొదటిరోజు వాదనలు ముగిశాయి. సమత తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిందితుల తరపున అడ్వకేట్ రహీం వాదనలు వినిపించారు.
రెండు వర్గాల వాదనలు విన్న జడ్జి..విచారణ రేపటికి వాయిదా వేశారు. ఎల్లుండి నుంచి సాక్షులను విచారించనుంది కోర్టు. ప్రతిరోజు నాలుగు నుంచి ఐదుగురు సాక్షులను విచారించనున్నట్లు తెలుస్తోంది.