
జనసేన లీగల్ సెల్ కో ఆర్డినేటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివ ప్రతాప్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది ఆ పార్టీ. ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు లీగల్ వింగ్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించనున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ లీగల్ వింగ్ కార్యకలాపాలను సమన్వయం చేస్తారు న్యాయవాదిగా అనుభవం ఉన్న ప్రతాప్ పార్టీకి విశిష్ట సేవలు అందించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ అభినందించారు.