EVMలు పని చేయటం లేదు.. పోలింగ్ టైం పెంచాలి: బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

EVMలు పని చేయటం లేదు.. పోలింగ్ టైం పెంచాలి: బీజేపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు

ఒడిశాలోని ఆరు లోక్ సభ స్థానాలకు శనివారం ఆరో విడత పోలింగ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. పూరీలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదని పూరీ బీజేపీ అభ్యర్థి సంబిత్ పాత్ర అన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారు దాదాపు 2గంటలు క్యూలైన్ లో వేచి ఉంటున్నారని, కొంతమంది పోలింగ్ బూత్ ల నుంచి వెనుదిరిగి పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

ఎన్నికల సంఘం ఈ సమస్యను పరిష్కరించాలని, ఓటింగ్ సమయాన్ని పెంచాలని సంబిత్ పాత్ర కోరారు. ఓటు వేయడానికి వచ్చిన  వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఆయన కూడా క్యూ లైన్ లో నిల్చొని ఓటేశారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల పోలింగ్ కు చాలా ఆలస్యం అవుతుందని ఆయన తెలిపారు.