ప్రభుత్వ భూములను కాపాడాలి
మేడ్చల్ కలెక్టరేట్ వద్ద కార్మికుల ఆందోళన
శామీర్ పేట, వెలుగు : జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని, ప్రజా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక మహిళా సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శామీర్ పేట కలెక్టరేట్‌వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్‌బీ మాట్లాడుతూ జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు.
అర్హులైన పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మిక మహిళా సమైక్య రాష్ట్ర ఇన్చార్జి ఎస్కే మీరా, సరిత పాల్గొన్నారు.