
హైదరాబాద్, వెలుగు: దేశ విదేశాల వంటకాలను వడ్డించే మల్టీక్విజిన్ రెస్టారెంట్ సంప్రద హైదరాబాద్లో మొదలయింది. దీనిని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో ప్రారంభమైన సంప్రద ప్రయాణం.. ఇప్పుడు అనేక నగరాలకు విస్తరించిందని అన్నారు. హైదరాబాద్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
సంస్థ డైరెక్టర్ నాగ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రెస్టారెంట్‌ను 5,000 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేశామని, 220 మంది కూర్చోవచ్చన్నారు. కాంటినెంటల్, చైనీస్ వంటకాలతో పాటు నెల్లూరు చేపల పులుసు, భీమవరం రొయ్యల వేపుడు వంటి దక్షిణ భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డిస్తామని వివరించారు.