ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ ప్రకటించిన శామ్​సంగ్​

ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ ప్రకటించిన శామ్​సంగ్​

హైదరాబాద్​, వెలుగు:  శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్ తన కస్టమర్ల కోసం 'ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టీవీలు, హోం అప్లయెన్సెస్​పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.  గెలాక్సీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై 41శాతం వరకు, ప్రీమియం టీవీలపై 48శాతం వరకు, రిఫ్రిజిరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  వాషింగ్ మెషీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై 43శాతం వరకు,  ఎయిర్ కండీషనర్లపై 58శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, యాక్సెసరీలు,  వేరబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా 65శాతం తగ్గింపు ఉంది.  బ్యాంక్ ఆఫర్లు, 'బై మోర్, సేవ్ మోర్' తగ్గింపులు,  ట్రేడ్-ఇన్ ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు శామ్​సంగ్​ డాట్ ​కామ్​, శామ్​సంగ్​ యాప్​, కంపెనీ ఎక్స్​క్లూజివ్​ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. కొన్ని బ్యాంకుల కార్డులను ఉపయోగించి కొంటే 22.5శాతం వరకు క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ లభిస్తుంది . రెండు లేదా అంతకంటే ఎక్కువ  వస్తువులు అదనంగా 5శాతం తగ్గింపు పొందవచ్చు.