
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ (Samsung) ఇప్పుడు ఒక కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్‌పై పని చేస్తోంది. ఇదొక అత్యంత శక్తివంతమైన A-సిరీస్, దీని మోడల్ పేరు Galaxy A86 5G. అయితే S-సిరీస్ కంటే కొంచెం గొప్పగా ఉండకపోవచ్చు, ఇందులో పవర్ ఫుల్ AMOLED డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 లేదా Exynos సమానమైన ప్రాసెసర్, 108MP కెమెరా సెటప్, S-సిరీస్ కంటే తక్కువ ధర, ప్రీమియం డిజైన్, కెమెరా పవర్, 5G పర్ఫార్మెన్స్ తో Samsung అనుభవాన్ని కోరుకునే కస్టమర్ల కోసం తీసుకొస్తున్నారు.
దీని చూస్తే డిస్ ప్లే గేలక్సీ A86 5Gలో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED+ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో ఉంటుందని అంటున్నారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, HDR10+ కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్స్ మల్టీమీడియా ప్రియులకు ఒక ట్రీట్ అని చెప్పొచ్చు. మ్యాట్ గ్లాస్ లాంటి ఫినిషింగ్, వాటర్ & దుమ్ము నుండి రక్షణ కోసం IP రేటింగ్‌తో అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఉండే అవకాశం ఉంది.
స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3/ఎక్సినోస్ 1480: ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 లేదా AMD RDNA GPUతో శామ్‌సంగ్ సొంత Exynos 1480 చిప్‌సెట్ ద్వారా పని చేస్తుంది, హై లెవెల్ 5G పెర్ఫార్మెన్స్, 8GB లేదా 12GB RAM అప్షన్,128GB/256GB UFS 3.1 స్టోరేజ్ అప్షన్, A86 5G మల్టీ టాస్కింగ్, గేమింగ్ అలాగే హై-పర్ఫార్మెన్స్ పనులను ఈజీగా చేసేస్తుంది.
OISతో 108MP ట్రిపుల్ కెమెరా సెటప్: కెమెరా విషయానికి వస్తే గెలాక్సీ A86 5Gలో 108MP ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు అల్ట్రా-వైడ్ & మాక్రో/డెప్త్ సెన్సార్ ఉండొచ్చని, శామ్సంగ్ సూపర్ HDR 4K@60fps సపోర్ట్ తో నైట్ ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌ను కూడా తీసుకోస్తుందని చెబుతున్నారు. అలాగే 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో సెల్ఫీ ప్రియుల కోసం AI ఫేస్ ఫిల్టర్లు ఉన్నాయి.
బ్యాటరీ & ఫాస్ట్ ఛార్జింగ్: ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది, ఇంతముందు ఉన్న A-సిరీస్ ఫోన్‌లలో ఉండే 25Wని అప్ గ్రేడ్ చేసింది. ఇందులో Samsung Knox సెక్యూరిటీ, Dolby Atmos స్టీరియో స్పీకర్లు, eSIMతో 5G డ్యూయల్-సిమ్ కూడా ఉండవచ్చు, అంతేకాదు ఫుల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్యాకేజీ అందిస్తుంది.
ఇండియాలో లాంచ్ & ధర ఎంతంటే : వచ్చే ఏడాది అంటే 2026 మొదట్లో ఇండియాలో లాంచ్ కావొచ్చు, సామాన్యులను దృష్టిలో ఉంచుకొని దీని ధర రూ.32,999 నుండి రూ.36,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండొచ్చు. ఈ ఫోన్ iQOO Neo 9 Pro, POCO X8 Ultra 5G, OnePlus Nord 4లకి పోటీగా తీసుకొస్తున్నారు, కానీ Samsung నమ్మకమైన బ్రాండ్ విలువ, బెస్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవం, ప్రీమియం డిస్ ప్లే క్వాలిటీ ఫోన్ కోరుకునే వారికీ ఈ Galaxy A86 5G ఒక బెస్ట్ అప్షన్ కావచ్చు.