
శామ్సంగ్ తన గెలాక్సీ జెడ్ఫ్లిప్ 5 ఫోన్‌ను బుధవారం గ్లోబల్‌గా లాంచ్ చేసింది. పెద్ద కవర్ డిస్‌ప్లే, కొత్త చిప్‌సెట్ దీని ప్రత్యేకతలు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్‌తో నడుస్తుంది. వాటర్- రెసిస్టెంట్ బిల్డ్ మరో ప్రత్యేకత. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్‌తో వస్తుంది. ఇందులో 3,700 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ఫ్లిప్ 5 ధర 999 డాలర్ల (సుమారు రూ. 82,000) నుంచి ప్రారంభమవుతుంది.