యూఎస్​లో శామ్​టెల్​ బిజినెస్​ విస్తరణ

యూఎస్​లో శామ్​టెల్​ బిజినెస్​ విస్తరణ

హైదరాబాద్​, వెలుగు: హై-టెక్నాలజీ మిలిటరీ సిస్టమ్స్​, ప్రొడక్టుల తయారీ భారతీయ సంస్థ అయిన శామ్​టెల్​ ఏవియానిక్స్​ లిమిటెక్​అంతర్జాతీయ విస్తరణ కార్యక్రమం చేపట్టింది. ఉత్తర అమెరికాలో తన వ్యాపార అభివృద్ధి & మార్కెటింగ్ ప్రతినిధిగా జీఈఎం డిఫెన్స్ సొల్యూషన్స్ ఎల్​ఎల్​సీని నియమించినట్లు బుధవారం ప్రకటించింది. జీఈఎం డిఫెన్స్ సొల్యూషన్స్   గ్రేడాన్ మైహ్రే, యూఎస్​,  కెనడాలో వివిధ వ్యాపారాల అభివృద్ధి,  మార్కెటింగ్​ కోసం పనిచేస్తారు.  దీనివల్ల ప్రస్తుత, 
కొత్త  కస్టమర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ కౌరా చెప్పారు.