'మాచర్ల నియోజకవర్గం'లోని సముద్రఖని ఫస్ట్ లుక్ రిలీజ్

'మాచర్ల నియోజకవర్గం'లోని సముద్రఖని ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ హీరో నితిన్, హీరోయిన్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్, పోస్టర్స్ రిలీజ్ కాగా... తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ పోషించనున్నట్టు తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో ఉన్న సముద్రఖని లుక్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపిస్తున్న ఆయన.. ఓల్డెజ్ లుక్ లో నెరిసిన జుట్టు, మీసంతో తెల్లటి కండువతో కలిగిన సముద్రఖని.. ఈ సినిమాలో రాజప్పగా అలరించనున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకూ పలు సినిమాల్లో ప్రతి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ఈ సినిమాతోనూ మంచి హిట్ కొడతారని ఆయన అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..  పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ‘మాచర్ల నియోజకవర్గం’ ఆగష్టు 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.