సాయంత్రం 6 గంటల నుంచి ముహురత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సాయంత్రం 6 గంటల నుంచి ముహురత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సాయంత్రం 6 గంటల నుంచి..ముహురత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 7.15 కి క్లోజింగ్ బెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • వోలటాలిటీ ఉండే ఛాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై :  సంవత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2080  ఆదివారం నుంచి మొదలుకానుంది. ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇదే రోజు సాయంత్రం 6 నుంచి 7.15 మధ్య జరగనుంది. కొత్త సంవత్సరంలోకి  ఎంటర్ అవుతున్న సందర్భంగా దీపావళి నాడు  గంట స్పెషల్​ ట్రేడింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎక్చేంజిలు నిర్వహిస్తున్నాయి. బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ఏర్పడ్డప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ముహురత్ ట్రేడింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షేర్లను కొంటే మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తారు. ఈ స్పెషల్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   15 నిమిషాల పాటు ప్రీ– ఓపెనింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. 

ముహురత్  సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏం జరుగుతుందంటే?

ఈ స్పెషల్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్లాక్ డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రీ ఓపెన్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  సాధారణ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లోజింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విడదీశారు. బ్లాక్ డీల్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయితే బయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక ధర నిర్ణయించుకొని, ఎక్స్చేంజిలకు తెలియజేస్తారు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ జరుగుతుంది.  2021, 2022 లో జరిగిన ముహురత్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ అర శాతం మేర లాభపడ్డాయి. అలా అని ఆదివారం జరిగే సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లాభపడతాయని చెప్పలేము.  ముహురత్ ట్రేడింగ్ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుందని, రిస్క్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చాలా కీలకమని ఎనలిస్టులు ట్రేడర్లకు సలహా ఇస్తున్నారు. ఒక షేరు లేదా ఒకే సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లలో డబ్బులు మొత్తం పెట్టొద్దని అన్నారు. లిక్విడిటీ ఎక్కువగా ఉన్న షేర్లలోనే ట్రేడింగ్ చేయాలని వెల్లడించారు. 

కొత్త ఏడాదిలో..

కొత్త సంవత్సరంలో కూడా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతుందని మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎనలిస్ట్ అరోరా పేర్కొన్నారు. ‘గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు వంటి పెద్ద ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లపై పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. దీనికి అదనంగా దేశంలోకి వస్తున్న విదేశీ డైరెక్ట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఐ) పెరిగాయి. యూఎస్ ఫెడ్ కూడా వడ్డీ రేట్లను పెంచదనే అంచనాలు ఉండడంతో మార్కెట్ పెరుగుతుందని నమ్ముతున్నాం’ అని వివరించారు. లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చని చెప్పారు.