‘విరూపాక్ష’.. మిస్టికల్ థ్రిల్లర్

‘విరూపాక్ష’.. మిస్టికల్ థ్రిల్లర్

‘భీమ్లా నాయక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్‌‌.. బింబిసార, సార్ సినిమాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ‘విరూపాక్ష’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ  చిత్రం ఏప్రిల్ 21న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ ‘ఇదొక మిస్టికల్ థ్రిల్లర్.  ఆంధ్రప్రదేశ్‌‌లోని  రుద్రవరం అనే గ్రామంలో జరిగే కథ. 1990 బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఉంటుంది. నా పాత్ర పేరు నందిని. పల్లెటూరులో పెరిగిన నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ. ఆమె మాట్లాడే విధానం, నడిచే తీరు.. అన్నీ క్యారెక్టరైజేషన్‌‌ను బట్టి బయటపడతాయి. కమర్షియల్‌‌ అంశాలతో కూడిన హారర్‌‌ థ్రిల్లర్‌‌ కాబట్టి.. హీరోయిన్ క్యారెక్టర్ ప్లెజెంట్‌‌గా ఉండాలి. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారు దర్శకుడు.

సినిమా కోసం వర్క్‌‌షాప్‌‌లు కూడా నిర్వహించడం ప్లస్ అయ్యింది.  సూర్య పాత్రలో సాయి తేజ్ కనిపిస్తారు. తను సెట్‌‌లో చాలా సరదాగా ఉంటాడు. కార్తీక్ విజన్ ఉన్న డైరెక్టర్. ప్రతి విషయంలో డీటెయిలింగ్‌‌గా చూసుకుంటాడు. సుకుమార్ గారి స్ర్కీన్‌‌ప్లే హైలైట్‌‌గా ఉంటుంది. భారీ ప్రాజెక్టులు నిర్మించిన ఎస్వీసీసీ బ్యానర్‌‌‌‌లో నటించడం ఆనందంగా ఉంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌‌నాథ్ ఇచ్చిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరుతో టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్‌‌తో ‘డెవిల్’ చిత్రంలో నటిస్తున్నా. ఇటీవల షూటింగ్ పూర్తయింది’ అని చెప్పింది.