డెవిల్‌‌‌‌ లో సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్

డెవిల్‌‌‌‌ లో సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్

కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌‌‌గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఆయనకు జంటగా సంయుక్త మీనన్ నటి స్తోంది. సోమవారం ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌‌‌‌ డే విషెస్ అందిస్తూ తన ఫస్ట్‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

ఇందులో ఆమె నైషద అనే పాత్రను పోషిస్తోంది. చీరకట్టులో ట్రెడిషనల్‌‌‌‌గా కనిపిస్తున్న ఆమె.. చేతిలో పువ్వులు, కొబ్బరి కాయతో గుడికి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తోంది. నవంబర్ 24న ఈ చిత్రం పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా రిలీజ్ కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.