సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వాడీల మధ్య మూడు, నాల్గో రైల్వే లైన్లు ..ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సనత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, వాడీల మధ్య మూడు, నాల్గో రైల్వే లైన్లు ..ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రూ.5,012 కోట్లతో 173 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని సికింద్రాబాద్ (సనత్ నగర్) – కర్నాటకలోని వాడీ మధ్య మూడవ, నాలుగవ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.5,012 కోట్లతో 173 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా తెలంగాణ, -కర్నాటక ఉమ్మడి ప్రాజెక్టుతో పాటు బిహార్, గుజరాత్, అస్సాంకు చెందిన నాలుగు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.12,328 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం(సీసీఈఏ) ప్రకటించింది. 

బిహార్, అస్సాం, గుజరాత్ లో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ లు..

బిహార్, అస్సాం, గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ కేబినెట్ ఆమోదం తెలిపింది. బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.1,156 కోట్లతో 53 కిలోమీటర్ల పొడవైన భాగల్పూర్ – జమాల్పూర్ 3వ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, అస్సాం పరిధిలో రూ.3,634 కోట్లతో చేపట్టే 194 కిలోమీటర్ల పొడవైన ఫర్కేటింగ్ – న్యూ తీన్ సుకియా డబ్లింగ్ పనులకు ఆమోదముద్ర వేసింది. 

వీటితో పాటు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దేశల్పార్ -హాజీపీర్ -లూనా-వాయోర్ – లఖపత్ కొత్త మార్గానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యూహాత్మకమైన ఈ లైన్ ‘రన్ ఆఫ్ కచ్’ను అనుసంధానిస్తోందని, హర్పాలోని ధోలావీర, కోటేశ్వర్ టెంపుల్, నారాయణ్ సరోవర్ – లఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పత్ కోట ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.