మట్టి మాఫియా.. టిప్పర్ మట్టి రూ. 10 వేలు

మట్టి మాఫియా.. టిప్పర్ మట్టి రూ. 10 వేలు

నల్లగొండ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది.  నకిరేకల్ మండలం నోముల గ్రామ చెరువులో యధేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు.   రాత్రికి రాత్రే వందల కొద్ది ట్రాక్టర్లతో చెరువులోని మట్టిని తవ్వి సమీప రైతుల వ్యవసాయ భూములలో భారీగా డంపింగ్ చేస్తున్నారు.   ఒక టిప్పర్ మట్టిని పదివేల రూపాయలకు ఇటుక బట్టి యాజమాన్యాలకు విక్రయిస్తూ లక్షల సంపాదిస్తున్నారు. ప్రశ్నించిన   రైతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.    అధికార పార్టీ నాయకుని ఆధ్వర్యంలో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. 

గ్రామస్తులు రైతుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇరిగేషన్ ఐబీ అధికారులు  మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను, ఒక జేసీబీని పట్టుకున్నారు.   గతంలో కవరేజ్ కోసం  వెళ్ళిన జర్నలిస్టులపై దాడులు చేయడానికి ప్రయత్నించారు.  అధికారులు కూడా   కేసు నమోదు చేయకుండా వెనకడుగు వేస్తున్నారు.