
ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ క్రికెటర్ , మాజీ కోచ్ సందీప్ పాటిల్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రభుత్వం బలపర్చిన అభ్యర్థి అమోల్ కాలే సిందీప్ పాటిల్ పై 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 370 ఓట్లున్న ఎంసీఏ ఎన్నికల్లో...కాలేకు 183 ఓట్లు రాగా...పాటిల్ కు 158 మంది ఓటేశారు. ఎంసీఏ ఎన్నికల్లో గెలిచిన కాలే...ఎంసీఏకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
సందీప్ అంటే గౌరవం..
ఎంసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అమోల్ కాలే..సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఓటేసిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. అటు క్రికెట్ కు సందీప్ పాటిల్ చేసిన సేవను గౌరవిస్తానన్నాడు. ఆయన అనుభవాన్నిఉపయోగించుకుంటానని చెప్పుకొచ్చాడు. సందీప్ గొప్ప క్రికెటర్ అని..అతని నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటానని చెప్పుకొచ్చాడు.
ఇది న్యాయమైన ఎన్నిక...
ఎంసీఏ ఎన్నిక ఫలితాలను గౌరవిస్తున్నట్లు మాజీ ప్రెసిడెంట్ సందీప్ పాటిల్ తెలిపారు. ఇది న్యాయమైన ఎన్నిక అని చెప్పాడు. తన ఓటమిని తనతో పాటు..తన బృందం అంగీకరిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపాడు. ఎంసీఏ అభివృద్ధికి తాను సహకరిస్తానన్నాడు.