
బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్(Ranbir kapoor), టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). ఇప్పటికే రిలీజ్ అవుతూ వస్తన్న ఈ సినిమా.. మళ్ళీ పోస్ట్ పోన్ అయిందనే వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించారు సందీప్ రెడ్డి వంగ. ఇందులో భాగంగా వీడియో బైట్ ను రిలీజ్ చేశారు.
"యానిమల్ సినిమా ఆగస్ట్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవలేదు. యానిమల్ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ కాబట్టి అయిదు భాషల్లో కలిపి మొత్తం 35 పాటలు అవుతాయి. ఏ భాషకి ఆ భాష పాటలు సెపరేట్ చేస్తున్నాను. యానిమల్ హిందీ డబ్బింగ్ సినిమా అని ఆడియన్స్ కి అనిపించకూడదు. అందుకే అంతలా కష్టపడుతున్నాం. దీనికి కాస్త సమయం పడుతున్నాయి. అందుకే ఈ సినిమాను డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. ఆరోజు థియేటర్స్ లో రణబీర్ కపూర్ విశ్వరూపం చూస్తారు" అంటూ చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి.
సందీప్ చెప్పిన ఈ మాటలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika mandana) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా.. తండ్రీకొడుకుల సెంటిమెంట్ తో రానుందని సమాచారం.