టాలెంటే పెట్టుబడి

V6 Velugu Posted on Jan 21, 2022

ఈరోజుల్లో ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం కామన్​. కొత్త ప్లేస్​కి వెళ్లినా, కొత్తగా ఏదైనా చేసినా అందరికీ తెలియాలి అని వాట్సప్​ స్టేటస్​, ఇన్​స్టాగ్రామ్ పోస్ట్​లు పెడుతుంటారు. పైగా వాటిని నచ్చినట్లు ఎడిట్ చేసుకుంటారు. ఇలాంటి టెక్నాలజీలు బోలెడున్నాయి. కానీ, ఏ కాలంలోనైనా మనసును తాకే జ్ఞాపకం ఆర్ట్. బొమ్మ గీసి, రంగులద్ది అందమైన పెయింటింగ్​లా తీర్చిదిద్దితే అది చూసిన వాళ్లకి నచ్చుతుంది. కాకపోతే ఈ టాలెంట్ కొంత మందికే సొంతం. ఆ టాలెంట్​నే పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నాడు ఆర్టిస్ట్ సందేశ్​. 

నిర్మల్ జిల్లా భైంసా మండలం పెండ పల్లె గ్రామానికి చెందిన సందేశ్​కు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్​తోనే గత పదేండ్లుగా పెయింటింగ్ వేస్తున్నాడు. ఇప్పటికే మన దేశ ప్రధాని, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ నాయకులు, పోలీస్​​ల పేయింటింగ్స్​ వేశాడు. సందేశ్​ది వ్యవసాయ కుటుంబం. బెంగళూరులో తెలిసినవాళ్ల దగ్గర ఉంటూ బ్యాచ్​లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచే ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఆర్ట్ కోర్సులో చేరాడు. దాంతో తన టాలెంట్​ ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది. ఎదురుగా నిలబడితే కొన్ని నిమిషాల్లోనే బొమ్మ గీసి చేతిలో పెట్టేస్తాడు. అలా ఇప్పటికే వందలాది పెయింటింగ్​లు వేసి కర్ణాటకలో కొన్ని ఎగ్జిబిషన్లలో పెట్టాడు. అంతేకాదు, అరుదైన వస్తువులు, నాణేలు, పుస్తకాలు, కెమెరాలు, వంటివి కలెక్ట్ చేస్తుంటాడు. ఇవి ఎంత దూరంలో ఉన్నా కూడా సొంత ఖర్చులు పెట్టుకొని సేకరిస్తాడు. 

సందేశ్ వేసిన పెయింటింగ్​లు చూసి కొంతమంది ఆర్థిక సాయం కూడా అందించేవాళ్లు. ఐదు వందల ఏండ్ల నాటి జ్ఞాపకాలు పెయింటింగ్స్​ వేయగా వచ్చిన డబ్బులతో ఐదు వందల ఏండ్ల నాటి వస్తువులు కలెక్ట్ చేశాడు సందేశ్. బ్రిటిష్ కాలం నాటి స్టాంప్​లు, కొన్ని దేశాల కెమెరాలు, రకరకాల నాణేలు, వందేండ్ల కిందటి న్యూస్ పేపర్స్, జాతి రాళ్లు, రాజుల కాలం నాటి వస్తువులు సేకరించాడు. వీటిని చూసినవాళ్లంతా అతడినెంతో అభినందిస్తున్నారు. 

– భైంసా, వెలుగు

Tagged Nirmal, Paintings, Sandesh, Sandesh Paintings

Latest Videos

Subscribe Now

More News