TRSలోకి సండ్ర వెంకట వీరయ్య

TRSలోకి సండ్ర వెంకట వీరయ్య

టీఆర్ ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. వీరు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ది కోసం కేసీఆర్ వెంట నడవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందని అన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలో టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి  బాగుందన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు సండ్ర.