ఏవియేషన్ సర్వీసెస్లో ఉద్యోగాలు.. ఇంటర్ ఉంటే చాలు.. మంచి జీతం కూడా..

 ఏవియేషన్ సర్వీసెస్లో ఉద్యోగాలు.. ఇంటర్ ఉంటే చాలు.. మంచి జీతం కూడా..

ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ఎయిర్​పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, లోడర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 21.

పోస్టుల సంఖ్య: 1446

పోస్టులు: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్​ 1017, లోడర్స్(పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు) 429.

ఎలిజిబిలిటీ: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు 12వ తరగతి, ఆపైన విద్యార్హతలు ఉన్న వారు అర్హులు. లోడర్స్ పోస్టులకు పదోతరగతి లేదా సమాన ​అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్​ పోస్టులకు 18 నుంచి 30 ఏండ్లు,  లోడర్స్ పోస్టులకు 20 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జులై 10. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21

అప్లికేషన్ ఫీజు: గ్రౌండ్ స్టాఫ్ పోస్టులకు రూ.350. లోడర్ పోస్టులకు రూ.250.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  igiaviationdelhi.com వెబ్ సైట్​లో సంప్రదించగలరు. 

ఎగ్జామ్ ప్యాటర్న్: మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. పరీక్ష ఇంగ్లిష్​, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. నెగెటెవ్ మార్కులు లేవు.  జనరల్ అవేర్ నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఏవెయేషన్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు 25 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.