
హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్ మెనూ రెడీ అయ్యింది. సామాన్య ప్రజలకు రూ.5కే రోజుకో వెరైటీ బ్రేక్ ఫాస్ట్ ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు రోజులు ఐదు వైరైటీల బ్రేక్ ఫాస్ట్ మెనూ రెడీ చేసింది. మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పొంగల్, ఇడ్లీ, పూరీ పెట్టనుంది.
మొత్తం ఒక్క ప్లేట్ కు ధర రూ.19 నిర్ణయించింది. ప్రజల నుంచి నుంచి ఒక్కో ప్లేట్ కు రూ. 5 వసూలు చేయనుంది. మిగతా రూ.14 ఖర్చును జీహెచ్ఎంసీ భరించనుంది. హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ మెనూను అందించనుంది.
హైదరాబాద్‌లోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని మొదటగా అమలు చేయనున్నారు. కొత్త కంటైనర్ క్యాంటీన్లను కూడా 139 ప్రాంతాల్లో రూ. 11.43 కోట్లతో ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. గతంలో ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా పేరు మార్చిన సంగతి తెలిసిందే.
ఆరు రోజులు ఇలా
- మొదటి రోజు: మూడు మిల్లెట్ ఇడ్లీలు (సాంబార్, చట్నీ,పొడి)
- రెండో రోజు : మిల్లెట్ ఉప్మా(సాంబార్,మిక్స్ చట్నీ)
- మూడో రోజు : పొంగల్(సాంబర్ ,చట్నీ)
- నాల్గో రోజు : మూడు ఇడ్లీలు( సాంబార్,చట్నీ)
- ఐదో రోజు : పొంగల్ (సాంబార్,చట్నీ)
- ఆరో రోజు : మూడు పూరీలు(ఆలూ కుర్మా)