మియాపూర్ లో విషాదం: నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

మియాపూర్ లో విషాదం:  నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు  నీటి సంపులో పడి  మృతి చెందాడు. 

 పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ లోని హఫీజ్‌పేట్ మార్తాండ నగర్ కాలనీలో శ్రీను, నీల దంపతుల నాలుగేళ్ల కుమారుడు అభి  ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జులై 12న  నీటి సంపులో పడి మృతి చెందాడు. కూలి పనుల కోసం ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిన తల్లిదండ్రులు  తమ కుమారుడి మరణ వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  ఇంటి యజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులు వారిని నిత్యం గమనిస్తూ ఉండండి. లేదంటే ఇలాంటి అనుకోని సంఘటనల తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది ముందు ఇంటి దగ్గర ఏవైనా గుంతలు కానీ..నీటి సంపులు ఉంటే మరింత  జాగ్రత్తగా ఉండండి.