‘కిష్కింధపురి’ సినిమాలో భయపెట్టిన.. శాండీ మాస్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

‘కిష్కింధపురి’ సినిమాలో భయపెట్టిన.. శాండీ మాస్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..

లియో, కొత్తలోక లాంటి డబ్బింగ్ చిత్రాలతో నటుడిగా తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్.. ఇటీవల ‘కిష్కింధపురి’ చిత్రంలోని విలన్‌‌‌‌ పాత్రతో టాలీవుడ్‌‌‌‌కు మరింత దగ్గరయ్యాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సందర్భంగా శాండీ మాస్టర్ మాట్లాడుతూ ‘‘విక్రమ్’ చిత్రంలో ఓ సాంగ్‌‌‌‌కు కొరియోగ్రఫీ చేసిన నాకు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘లియో’ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత నటుడిగా వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ సైకో పాత్రలే. ఆ టైమ్‌‌‌‌లోనే  కొత్త లోక, కిష్కింధపురి సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌ చేసే అవకాశం వచ్చింది. ఈ రెండు చిత్రాలు దాదాపు ఒకే సమయంలో షూటింగ్ జరిగాయి. రెండూ  సక్సెస్ అవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

‘కిష్కింధపురి’లో నా క్యారెక్టర్ చాలా ఎక్సయిటింగ్‌‌‌‌గా ఉంటూ కిక్ ఇచ్చింది.  ఆ పాత్ర కోసం దాదాపు ఏడు గంటల పాటు టెస్ట్ షూట్ చేశాం. నా పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. నేను కొరియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ని అయినా ప్రస్తుతం యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను. ప్రభుదేవా, లారెన్స్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ తరహాలో నటుడిగా కొనసాగుతూనే  దర్శకత్వం కూడా చేయాలనే ఆసక్తి ఉంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ఇటీవల ‘ఓజీ’ ప్రమోషనల్ సాంగ్‌‌‌‌కి కొరియోగ్రఫీ చేశాను.  ప్రస్తుతం  పా రంజిత్ గారి నిర్మాణంలో హీరోగా ఒక సినిమా చేస్తున్నా.  అనుష్క గారు  నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథామినార్’లో  కీలక పాత్ర చేస్తున్నా’ అని చెప్పాడు.