సంగారెడ్డిలో ఆటోడ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ : దొరికిన బంగారు నగల బ్యాగ్ ను అప్పగించాడు..!

సంగారెడ్డిలో ఆటోడ్రైవర్ నిజాయితీకి హ్యాట్సాఫ్ : దొరికిన బంగారు నగల బ్యాగ్ ను అప్పగించాడు..!

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు ఉన్న బ్యాగును ఓ ఆటోడ్రైవర్​పోలీసుల ద్వారా ప్రయాణికుడికి అప్పగించాడు. సోమవారం కల్హేర్ మండల కేంద్రానికి చెందిన సంఘవుని శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డిలోని మల్కాపూర్ చౌరస్తాలో ఉన్న బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. 

నగలు కలిగిన బ్యాగును ఆటోలో మర్చిపోయాడు. బ్యాగును గమనించిన ఆటో డ్రైవర్ సైక్ ఖదీర్  సంగారెడ్డి టౌన్ పీఎస్​లో అప్పగించాడు. శ్రీనివాస్ తన బ్యాగ్ మిస్ అయిన విషయాన్ని గుర్తించి పీఎస్​లో ఫిర్యాదు చేయడానికి రాగా అక్కడ తన బ్యాగును గుర్తించి సంతోషం వ్యక్తం చేశాడు. తన బ్యాగును అప్పగించిన ఆటో డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపాడు.